నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షో మొదటి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు మరియు అయన కుమారుడు నారా లోకేష్ పాల్గొన్నారు. వీరిద్దరితో కలిసి బాలయ్య చేసిన సందడికి వీక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతూ.. తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదం అందించారు బాలయ్య.
మొదటిసారి ఓ టాక్ షో వేదికగా బాలయ్యతో కలిసి చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొనడంతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్ అయ్యింది. అంతే కాకుండా 24 గంటల్లో 10 లక్షల వ్యూస్ తెచ్చుకుని రికార్డు సృష్టించింది.
ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ కోసం.. బాలయ్యతో కలిసి మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వస్తున్నారు యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.
ఈ ఎపిసోడ్ కు సంభందించిన ప్రోమోలో సిద్దు జొన్నలగడ్డలు, విశ్వక్ సేన్‌లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురితో బాలకృష్ణ చెడుగుడు ఆడుకున్నట్లు కనిపిస్తుంది. ప్రోమోలో వేదికపైకి రావడంతోనే సిద్దూకు పంచ్ వేశారు బాలయ్య. ఎవరయ్యా సిద్ధూ బాబుకు తల దువ్వకుండా పంపించారు..హే మేకప్ మేన్, హెయిర్ స్టైలిస్ట్ అంటూ బాలయ్య పిలుస్తుండగా.. ఇది మెస్సీ లుక్ సర్ అని చెప్పాడు సిద్దూ. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాలన్ని మెస్సయ్యాయి అంటూ నవ్వులు పూయించారు.
విశ్వక్.. మాస్ కా దాస్.. సిద్దు యాస్ కా మాస్.. కానీ మీరు ఎవరితో ఉన్నారో తెలుసా? గాడ్ ఆఫ్ మాస్ అని బాలయ్య తన గురించి తాను చెప్పుకున్నారు. ఇక ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి ముచ్చటించారు. ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటే చాలు అని ఎవరితో అనిపిస్తుంది అని బాలకృష్ణ అడగ్గా.. తనకు కియరా అద్వానీ అంటే క్రష్ అని చెప్పేశారు సిద్దూ. దీంతో షూటింగ్ లేకపోయిన పర్లేదు అంటూ మరో పంచ్ వేశారు బాలయ్య.
ఆ తర్వాత వీరిద్దరు కలిసి మీ కరెంట్ క్రష్ ఎవరని బాలకృష్ణ నే అడగ్గా.. రష్మిక మందన్నా అంటూ అసలు విషయం చెప్పేశారు. మొత్తానికి ఈ ముగ్గురు కలిసి అన్‌స్టాపబుల్ వేదిక పై తెగ సందడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా అన్‌స్టాపబుల్ సీజన్-2 రెండవ ఎపిసోడ్ ఈ శుక్రవారం అంటే దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21 తేదీన ప్రసారం కానుంది.