Home సినిమా వార్తలు Ranga Marthanda: రంగమార్తాండ థియేట్రికల్ రైట్స్ ను మంచి ధరకు కొనుగోలు చేసిన మైత్రీ మూవీస్

Ranga Marthanda: రంగమార్తాండ థియేట్రికల్ రైట్స్ ను మంచి ధరకు కొనుగోలు చేసిన మైత్రీ మూవీస్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఈ ఉగాదికి విడుదలకు సిద్ధమవుతోంది. తన గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బోల్తాకొట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ.4 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలే మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

మార్చి 22న విడుదల కానున్న ఈ చిత్రం 2016లో విడుదలైన మరాఠీ బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన సమీక్షలతో పాటు ఆదరణను పొందింది మరియు ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

రంగస్థలం నుంచి రిటైర్ అయినా నాటకరంగం, రంగస్థలం పట్ల తనకున్న మధుర స్మృతులను మరచిపోలేని రంగస్థల నటుడి విషాద కుటుంబ జీవితాన్ని రంగమార్తాండ చిత్రిస్తుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమలోని సభ్యుల కోసం నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్స్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు అందరి చూపు మార్చి 22 మీద పడింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version