Homeసినిమా వార్తలుయూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ రంగ వైభవంగా

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ రంగ వైభవంగా

- Advertisement -

తొలి సినిమా “ఉప్పెన”తో యంగ్ హీరోల లిస్ట్ లో రికార్డులు సృష్టించిన మెగా మెన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.త‌రువాత వ‌చ్చిన ‘కొండ‌పొలం’ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం ‘రంగ‌రంగ వైభ‌వంగా’.కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ ఆదిత్య వ‌ర్మ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గిరీశ‌య్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించాడు.

ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం త‌ర‌చూ ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తూ పబ్లిసిటీని చక్కగా చేస్తున్నారు.కాగా ఇదివరకు విడుదలైన ఈ చిత్రం తాలూకు ప్రి టీజర్ ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు తెలుసా తెలుసా,కొత్తగా లేదేంటి జనాదరణ పొందాయి.

ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది.సినిమాలో లవ్,యాక్షన్,ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపినట్టుగా అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే.హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నా ఇగోల వల్ల బయటకి చెప్పుకోలేని ప్రేమికులుగా వైష్ణవ్,కేతిక కనిపిస్తున్నారు. ఎనర్జీతో వైష్ణవ్ ఆకట్టుకోగా, క్యూట్ అండ్ హాట్ గా కనిపించి కేతీక కూడా ధీటుగా నిలిచింది.ఇక సినిమాలో ఆలీ,సుబ్బరాజు కూడా ఉన్నట్టు టీజర్ ద్వారా తెలిసింది.ఈ సినిమాని తొలుత జూలై 1న రిలీజ్ చేయాలని చూసినా,ఇతర చిత్రాల వాయిదా వల్ల మళ్ళీ మార్చాల్సి వచ్చింది.దాంతో ఈ సినిమానిజూలై నెల చివర్లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

READ  పుష్ప 2 - తగ్గేదేలే అంటున్న సుకుమార్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories