Home సినిమా వార్తలు విజిల్ వేయిస్తున్న “ది వారియర్” కొత్త పాట

విజిల్ వేయిస్తున్న “ది వారియర్” కొత్త పాట

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్ నటిస్తున్నారు.లేటెస్ట్ సెన్షేశన్ బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఇది వరకే విడుదలైన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయి తెగ వైరల్ అయిపొయింది.ఆ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాట పాడటం విశేషం.

Whistle Lyrical Song (Telugu) | The Warriorr | Ram Pothineni, Krithi Shetty | DSP | Lingusamy

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్ అయింది. Whistle అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది.ఉర్రూతలూగించే బీట్ తో పాటు మంచి డాన్స్ కి స్కోప్ కూడా ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బుల్లెట్టు సాంగ్ లో అలరించిన రామ్ – కృతి శెట్టి ల జోడీ డాన్స్ మరోమారు ఈ పాటలోనూ ఆకట్టుకుంది. సాహితి లిరిక్స్ అందించిన ఈ పాటను అంతోనీ దాసన్, శ్రీనిష జయశీలన్ పాడారు.పైగా రామ్ – దేవిశ్రీప్రసాద్ ల కాంబో హిట్ కాంబో అని మరోసారి రుజువు అయింది. చక్కని బీట్ తో పాటు క్యాఛీ లిరిక్స్ ఉండేలా చూసుకోవడం దేవిశ్రీప్రసాద్ కు తిరుగే లేదు. అందుకే తన కెరీర్ ఇన్ని ఏళ్ల పాటు విజయవంతంగా సాగుతుంది.

వచ్చే నెల అంటే జూలై 14 న రిలీజ్ అవబోతున్న ది వారియర్ చిత్రం మీద రామ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అసక్తి గా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 తరువాత మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా ఏదీ రాలేదు. కాబట్టి పాటలు హిట్ అయి, పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న ది వారియర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version