హీరో రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో “ది వారియర్” అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులను కూడా చకచకా జరిగేలా చూస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
హీరో రామ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కింది. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగా విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించుకుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు తెలుగులో దర్శకుడు బోయపాటి గారు రిలీజ్ చేయగా, తమిళ ట్రైలర్ ను ట్విట్టర్ లో తమిళ యువ హీరో శివ కార్తికేయన్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ గెటప్ అదిరిపోయింది. “ఒక చెట్టు మీద నలభై పావురాలు ఉంటే అందులో ఒక్క దాన్ని కాలిస్తే అన్నీ ఎగిరిపోతాయి” అంటూ హీరోయిజం ఉట్టిపడే డైలాగ్స్ తో పక్కా మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది ది వారియర్ సినిమా. ఇక విలన్ పాత్రలో ఆది కూడా రామ్ కు ధీటుగా ఉన్నాడు, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించేలా ఉన్నాయి. ఇక లేటెస్ట్ సెన్సేషన్ అయిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా,హీరో తల్లి పాత్రలో నదియా కనిపించారు
.‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే రామ్ మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపోందనుంది.