RRR చిత్రం అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తంగా ఇండియా, రెగ్యులర్ ఓవర్సీస్ ఏరియాలలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు జపాన్‌కు వెళ్తోంది. జపాన్‌లో మంచి వసూళ్లు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా KGF2 కలెక్షన్స్‌ను క్రాస్ చేస్తుంది. ప్రస్తుతానికి, KGF2 ప్రపంచవ్యాప్త కలెక్షన్లలో RRR కంటే ముందుంది.
ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘RRR’ విడుదల మరియు ప్రమోషన్స్ కోసం జపాన్ చేరుకున్నారు. కాగా చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల మరియు వారి పెంపుడు కుక్క రైమ్‌తో విమానాశ్రయంలో కనిపించారు. ఈ జంట క్యాజువల్ వేర్ ధరించి ఎయిర్‌పోర్ట్‌లో పోజులు ఇస్తున్న ఫోటోలు మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యాయి. సెల్ఫీలు మరియు ఆటోగ్రాఫ్‌ల కోసం తన అభిమానుల అభ్యర్థనలను రామ్ చరణ్ ఆనందంగా అంగీకరించారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ కూడా జపాన్‌కు వెళ్లబోతుండగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
‘బాహుబలి’తో రాజమౌళి తన సినిమాలకు జపాన్‌లో చెప్పుకోదగ్గ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ కూడా జపాన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ మార్కెట్‌ని కైవసం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
అక్టోబర్ 21న జరిగే స్క్రీనింగ్‌కు హాజరవుతానని రాజమౌళి ఇప్పటికే తన జపాన్ అభిమానులకు హామీ ఇచ్చారు. ఆస్కార్ నామినేషన్ పై కూడా RRR టీమ్ ఆశలు పెట్టుకుంది. For Your Consideration (FYI) క్యాంపెయిన్ ద్వారా వారు ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, RRR టీమ్ జపాన్ లోని ప్రచార నిమిత్తం టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా, ఇతర మీడియా సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు, RRR స్క్రీనింగ్ కోసం టిక్కెట్లు చాలా త్వరగా మరియు పెద్ద సంఖ్యలో విక్రయించబడే అవకాశం ఉంది.
భారతదేశంలో RRR ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి తరువాత బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. కాగా ధియేటర్లలో విడుదల అయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మరియు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధ చిత్రంగా మారింది. హాలీవుడ్ మేకర్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. బాహుబలి వలె RRR ప్రపంచ స్థాయిలో నిలబడగలదా అనే ప్రశ్నలు తలెత్తాయి, అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ తర్వాత దాని విజయం పై ఉన్న అన్ని సందేహాలు తొలగిపోయాయి.
ఇక విడుదలైన ప్రతి చోటా విజయం సాధించిన RRR జపాన్‌లో కూడా భారీ కలెక్షన్లను సాధిస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే RRR జపాన్ లో భారీ విజయం సాధించాలని కోరుకుందాం.