పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ మూవీ లో తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు సుజీత్ ఎంతో జాగ్రత్తగా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓజి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా త్వరలో మూవీ నుండి ఒక్కొక్కటిగా కంటెంట్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది టీమ్.
విషయం ఏమిటంటే, ఈ మూవీలో ఒక సాంగ్ కోసం ఒకప్పటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గారిని తీసుకోనున్నాం, ఆయనతో ఒక సాంగ్ పాడించాలనేది నా ఆలోచన అని తాజాగా చెప్పుకొచ్చారు థమన్. అలానే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ మంచి కీబోర్డ్ ప్లేయర్ అని, అతడితో రెండు నెలలు కలిసి పనిచేసిన తాను, ఈ మూవీ కోసం వర్క్ చేయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిపారు థమన్. కాగా ఓజి మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి రానుంది.