Homeబాక్సాఫీస్ వార్తలుఈ వారం సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

ఈ వారం సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

- Advertisement -

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, శరత్ మండవ దర్శకత్వం వహించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తొలి ఆట నుంచే అటు ప్రేక్షకులు ఇటు సినీ విమర్శకులు సినిమా పై పెదవి విరిచారు.

అయితే తొలి రోజు వరకూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనే స్ధాయిలో వసూళ్లు సాధించింది. కానీ రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ వసూళ్లు భారీగా క్షీణించాయి. తొలి రోజు రామారావు ఆన్ డ్యూటీ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ను సాధించింది. అదే స్థాయిలో కొనసాగి ఉంటే చిత్రం విజయం ఖాయం అయ్యేది కానీ.. తొలి రోజుతో పోల్చుకొంటే.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం భారీగా పడిపోయింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 13 శాతం ఆక్యుపెన్సీ నమోదవడం గమనార్హం. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలయ్యే అవకాశాలే ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

READ  కొరటాలను వీడని ఆచార్య గాయాలు

రామారావు ఆన్ డ్యూటీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 4.5 కోట్లు రాబట్టింది.ఇంకా 13.5 కోట్లు రాబట్టాలి అంటే ఏదో అద్భుతమే జరిగి కలెక్షన్లు పుంజుకుంటే తప్ప అది సాధ్య పడదని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక రామారావు ఆన్ డ్యూటీ తో పాటు కిచ్చా సుదీప్ నటించిన ప్యాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ భారీ అంచనాల నడుమ ఈ గురువారం విడుదలయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. విక్రాంత్ రోణ తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన వసూళ్లు రాబట్టింది. దాదాపు 2 కోట్ల గ్రాస్ తో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, అయితే, రెండో రోజు ఇతర సినిమాల తాకిడి వల్ల కాస్త తగ్గినా, మళ్ళీ శనివారం ఈ చిత్రం పుంజుకుంది. ఎవరూ ఊహించని విధంగా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ స్టేటస్ వైపు పరుగులు తీస్తుంది.

READ  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ రంగ వైభవంగా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories