యువ నటుడు ఉస్తాద్ రామ్ పోతినేని చలా కష్టపడి తొలి చిత్రం దేవదాస్ తో సూపర్ హిట్ అందుకున్నారు. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఆ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఇక అక్కడి నుండి వరుసగా పలు చిత్రాలని చేస్తూ మధ్యలో కొన్ని సక్సెస్ లతో మంచి క్రేజ్, టాలెంట్ తో కొనసాగుతూ టైర్ 2 హీరోల్లో మంచి పేరు గడించాడు.
రామ్ డాన్సులు, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ చేయగలడు కానీ ఇటీవల మాత్రం కెరీర్ పరంగా సరైన స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకోకపోవడం అతని సమస్య. నిజానికి అతను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ గుర్తింపు లేదు. ఇక తాజాగా టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ కోసం అతను యాక్షన్ మరియు డ్యాన్స్‌లలో ఎంతో బాగా అదరగొట్టాడు కానీ ప్రశంసలు కానీ గుర్తింపు కానీ లేదు.
దానికి కారణం ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలవడం. పూరి స్వయంగా నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు భారీ నషాలు మిగిల్చింది. నిజానికి రామ్ ఇటీవల సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో ఎంతో తడపడుతున్నాడు. తాజాగా డబుల్ ఇస్మార్ట్ తో మరొక ఫ్లాప్ చవిచూసిన రామ్, ఇకనైనా కథ, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త వహించినప్పుడే పడే కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది.