టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన రామ్ పోతినేని ఇటీవల కెరిర్ పరంగా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేకపోతున్నారు. ఇక తాజాగా యువ దర్శకుడు పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ చేస్తున్న మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.
మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా కనిపిస్తుండగా దీనిని రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో రామ్ పాత్ర అదిరిపోతుందని యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా మరొక్కసారి రామ్ తన పాత్రలో అదరగొడుతున్నట్లు చెప్తోంది టీమ్. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారట. కథ రీత్యా ఈ టైటిల్ సరిపోనుందని టాక్. యువతలో రామ్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ టైటిల్ మరింతగా యాప్ట్ అవుతుందని అంటున్నారు.
మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్రకి కూడా సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందట. కాగా ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా వివేక్ మరియు మెర్విన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెళ్తాను వెల్లడి కానున్నాయి.