RC15 సినిమా నుంచి తాజాగా లీకైన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లీకైన పిక్స్ చూస్తుంటే ఈ సీన్ ఒక పొలిటికల్ మీటింగ్ గురించి అని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారని పలు రకాల వార్తలు , కొన్ని లీకైన పిక్స్ ద్వారా తెలిసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరైన శంకర్ తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్, హైప్ నెలకొంది.
ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ అయి వైరల్ గా మారాయి. ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉందని ఈ ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది. భారీ స్థాయి వినోదంతో సామాజిక సందేశంతో సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట అని తెలిసిందే. ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతకు ముందు ఈ సినిమా నుండి కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ వచ్చాయి, ఇందులో చరణ్ గ్రామ పెద్ద మరియు అంజలి అతని భార్యగా కనిపించారు. అంతే కాకుండా RC 15లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో ఒక పాత్ర సీబీఐ ఆఫీసర్ కాగా మరో వార్తలు వస్తున్నాయి.
సునీల్, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సోషల్ డ్రామాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు.