మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ చిత్రం తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూసిన ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని వర్గాల అభిమానులకు, ప్రేక్షకులకు ఫేవరెట్ మూవీగా ప్రశంసలు అందుకుంటోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా ఈ సినిమాను విడుదల చేసి, కలెక్షన్స్ లో వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు.
ఇటీవలి కాలంలోనే ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు ధృవీకరించారు. ప్రేమకథల్లో స్పెషలిస్ట్ అయిన దర్శకుడుగా పేరు పొందారు బొమ్మరిల్లు భాస్కర్. అయినా.కూడా, ఆరెంజ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది, బహుశా ఈ సినిమాలోని కథాంశం సమయం కంటే చాలా ముందుండటం వల్లే అని కూడా కొందరు అంటారు. ఇది పర్ఫెక్ట్ మూవీ కాదు కానీ అద్భుతమైన మ్యూజిక్, కలర్ ఫుల్ విజువల్స్ తో కూడుకున్న కొన్ని ఆహ్లాదకరమైన మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ యూత్ ఈ సినిమాను వివిధ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పటికీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో సినిమాకు ఇంకా మంచి స్పందన రావాల్సిందని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు.
సోషల్ మీడియా యూజర్లు ఇప్పటికీ ఆరెంజ్ సినిమాని చాలా పొగడ్తలతో ముంచెత్తుతారు కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని ఒక వర్గం వారు అంటున్నారు. అయితే ఇది వన్ సైడ్ సినిమా కావడం వలన, అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేదని, అందువల్ల మళ్ళీ విడుదల చేయడం వల్ల పెద్దగా లాభం ఉందని కూడా కొందరు అంటున్నారు. మరి ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయాలనే ఆలోచన వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.