మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఇటీవల శంకర్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, సముద్రఖని, ఎస్ జె సూర్య, అంజలి తదితరులు నటించారు.
ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ మూవీ పరాజయం పాలైనపుడు హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ తమకి కనీసం ఫోన్ కూడా చేయలేదని అన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి బిగెస్ట్ పాన్ ఇండియన్ మూవీ అనంతరం దిల్ రాజుకు డేట్స్ కటించారు చరణ్. అయితే అదే సమయంలో శంకర్ అటు ఇండియన్ 2 మూవీ పనుల్లో ఉండడంతో రెండు సినిమాలు ఆయన ఒకేసారి చేస్తూ కొనసాగారు.
దానితో గేమ్ ఛేంజర్ బాగా ఆలస్యం అవడంతో పాటు పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఎంతో భారీ వ్యయం అయింది. కానీ ఫైనల్ గా సినిమా ఫెయిల్యూర్ విషయమై రామ్ చరణ్ ని మాత్రమే నిర్మాత శిరీష్ నిందించడం కరెక్ట్ కాదు. అసలు మొదట అంత ఖర్చు చేసి, భారీ ఫుటేజ్ తీసి సమయం వృధా చేసిన శంకర్, దిల్ రాజు లది మేజర్ తప్పిదం. కానీ మొత్తంగా ఈ విషయంలో చరణ్ పై శిరీష్ టార్గెట్ చేస్తూ మాట్లాడంతో పలువురు అయన ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.