Homeసినిమా వార్తలుRam Charan: సల్మాన్ ఖాన్ - వెంకటేష్ ల కిసీ కా భాయ్ కిసీ కీ...

Ram Charan: సల్మాన్ ఖాన్ – వెంకటేష్ ల కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో మరియు విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న కిసీ కా భాయ్ కిసి కీ జాన్ చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే.

రామ్ చరణ్ ఈ అతిథి పాత్ర చేయడం గురించి చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం చరణ్ ఓ పాటలో కనిపించి సల్మాన్, పూజా హెగ్డే, వెంకటేష్ లతో సరదాగా స్తెప్పులేస్తారని అంటున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు.

సల్మాన్ ఖాన్ ఈద్ సందర్భంగా కిసీ కా భాయ్ కిసి కీ జాన్ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన గత చిత్రం రాధే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ షారుఖ్ ఖాన్ ఇటీవలి బ్లాక్ బస్టర్ పఠాన్ లో ఆయన చేసిన పొడిగించిన అతిథి పాత్ర అభిమానులను ఎనలేని ఎనర్జీతో ఉత్సాహపరిచింది. ఈ ఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సినిమా కిసీ కా భాయ్ కిసి కీ జాన్ ఒకటి.

READ  RRR Awards: HCA స్పాట్‌లైట్ అవార్డు పై మెగా ఫ్యామిలీ యొక్క ఫేక్ పబ్లిసిటీని బట్టబయలు చేసిన RRR టీమ్

కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాకు ముందుగా తాత్కాలికంగా కభీ ఈద్ కభీ దివాళీ అనే టైటిల్ ను నామకరణం చేశారు, తరువాత దానిని ప్రస్తుత టైటిల్ కు మార్చారు. సల్మాన్ తో పాటు వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే, జగపతి బాబు, భూమిక చావ్లా, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయాల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, వినాలి భట్నాగర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2014లో అజిత్ కుమార్ హీరోగా నటించగా తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్ చిత్రానికి హిందీ రీమేక్ గా తెరకెక్కింది. కాగా ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సల్మా ఖాన్ నిర్మించారు. కిసి కా భాయ్ కిసి కి జాన్ ఈద్ 2023, ఏప్రిల్ 21 న విడుదల కానుంది మరియు జీ స్టూడియోస్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

READ  RRR Fan Wars: హాలీవుడ్‌కు చేరుకున్న ఎన్టీఆర్ - మెగా ఫ్యాన్స్ వార్

సల్మాన్ ఖాన్ నటించిన రెండు పెద్ద సినిమాలు ఒకే ఏడాదిలో విడుదల కావడం ఇదే తొలిసారి. 2023 సంవత్సరం చివర్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ యొక్క టైగర్ 3 లో కూడా ఈ స్టార్ హీరో కనిపిస్తారు. కాబట్టి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో రామ్ చరణ్, వెంకటేష్, సల్మాన్ ఖాన్ లను ఒకే ఫ్రేమ్ లో చూడ్డానికి వేచి చూద్దాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories