ప్రస్తుతం మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు సనతో కలిసి RC 16 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ యక్షన్ డ్రామాగా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతున్న ఈమూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంస్థల పై యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ వ్యయంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ విజయం ఖాయం అని ఇటీవల దర్శకుడు బుచ్చి బాబు ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. అయితే విషయం ఏమిటంటే, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. కాగా 2026 మార్చి 26న తమ మూవీని రిలీజ్ చేసేందుకు RC 16 టీం సిద్ధమైందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
కాగా సరిగ్గా అదే డేట్ ని నాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో శ్రీకాంత్ ఓదెల తీయనున్న పాన్ ఇండియన్ మూవీ ది ప్యారడైజ్ కోసం లాక్ చేసారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ కనుక నిజం అయితే నాని మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారా అనేది మాత్రం తెలియాలి. కాగా RC 16 మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తేనే కానీ వీటి పై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.