Homeసినిమా వార్తలురామ్ చరణ్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గిఫ్ట్

రామ్ చరణ్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గిఫ్ట్

- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సనా ఒక భారీ పాన్ ఇండియన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వీ కపూర్  కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ఎక్కడా కూడా బ్రేకుల్లేకుండా కొనసాగుతోంది. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి యువనిర్మాత వెంకట సతీష్ కిలారు దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర  అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు బుచ్చిబాబు. అలానే కథ, కథనాలు కూడా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారని టాక్. 

విషయం  ఏమిటంటే, మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ రానుందట. అలానే ఆ గ్లింప్స్ మామూలుగా లేద‌ట‌. సుకుమార్ చ‌ర‌ణ్ కోసం రంగ‌స్థ‌లం తీస్తే దాన్ని మించిపోయే సినిమాని శిష్యుడు డిజైన్ చేస్తున్నాడ‌ని, ఈ ఒక్క గ్లింప్స్‌తో చిత్ర‌సీమ మొత్తం చ‌ర‌ణ్ వైపు తిరిగి చూస్తుంద‌ని చెబుతున్నారు. 

అలానే అదేరోజున మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారట. మొత్తంగా రామ్ చరణ్ బర్త్ డే కి ఫ్యాన్స్ కి ఇది పెద్ద సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని అంటున్నారు. కాగా ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానున్నట్లు టాక్. 

READ  ఒకే బాటలో నడుస్తున్న RC 16, SSMB 29 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories