మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈమూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీని అనంతరం తన కెరీర్ 16వ మూవీని బుచ్చి బాబు సన తో చరణ్ చేయనున్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారితో కలిసి వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.
ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈమూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ గురించిన మారినా వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.