మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
దీని అనంతరం బుచ్చిబాబు సనతో నెక్స్ట్ మూవీ చేయనున్నారు చరణ్, ఆ తరువాత సుకుమార్ తో మరొక మూవీ కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు సుకుమార్. అలానే మరోవైపు ఇటీవల సలార్ తో మంచి విజయం సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, త్వరలో ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుపుకుంటోన్న ఈ మూవీ అనంతరం సలార్ 2, కెజిఎఫ్ 3 మూవీస్ కూడా చేయనున్నారు ప్రశాంత్ నీల్. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూడు సినిమాల అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ఒక మూవీ చేయనున్నారని, డివివి దానయ్య దీనిని భారీ వ్యయంతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందట.