టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నాడు చరణ్. ఈమూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి గ్రాండ్ గా నిర్మిస్తుండగా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దీని అనంతరం ఇప్పటికే సుకుమార్ తో ఒక మూవీ కూడా కమిట్ అయ్యాడు చరణ్. విషయం ఏమిటంటే,ఇటీవల బాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కిల్ తెరకెక్కించి విజయం అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో త్వరలో రామ్ చరణ్ ఒక భారీ మైథలాజికల్ మూవీ చేయనున్నారని, ఇప్పటికే ఈ మూవీ విషయమై వీరిద్దరి మధ్యన చర్చలు జరిగినట్టు టాక్. త్వరలో ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీ గురించిన న్యూస్ అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.