మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, ఎస్ జె సూర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ అందుకుంది. విషయం ఏమిటంటే, నిన్న ఒక కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ లో మొత్తంగా ఏడు సాంగ్స్ ఉన్నాయని అన్నారు.
అలానే ఆగష్టు నుండి ప్రమోషన్స్ మొదలవుతాయని తెలిపారు. దానిని బట్టి ఆగస్ట్ ఆఖరివారం లో గేమ్ ఛేంజర్ నుండి రెండవ సాంగ్ రిలీజ్ కానుందని ఆపైన మిగతా సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ వరుసగా వస్తాయని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ఈ ఏడాది క్రిస్మస్ కి దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.