టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ తో చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనుండగా కీలక పాత్రల్లో అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.
ఇక తమ మూవీని రానున్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. విషయం ఏమిటంటే, నేడు గేమ్ చేంజర్ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసాం అని, అలానే మూవీని పక్కాగా క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.