మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ అనే పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. విషయం ఏమిటంటే, ఈ మూవీలో తాను ఒక అద్భుతమైన సాంగ్ రాసానని, అది విజువల్ గా కూడా అదిరిపోతుందని తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ తెలిపారు లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్.
శంకర్ గారి భారతీయుడు 2 కి వర్క్ చేసానని, ఇక గేమ్ ఛేంజర్ సాంగ్ తనకు మరింతగా పేరు తీసుకువస్తుందని అన్నారు. కాగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ అంజలి ల పై సాగనున్న ఈ సాంగ్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. కాగా త్వరలో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది.