మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల మరొక స్టార్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ మూవీలో రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనుండగా ఆ పాత్రని ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారట దర్శకుడు శంకర్.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి బాగా రెస్పాన్స్ అందుకుంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఒకింత వణుకు ప్రారంభమైందని అంటున్నాయి సినీ వర్గాలు. కారణం ఏంటంటే, కమల్ హాసన్ తో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 మూవీ నేడు రిలీజ్ అయి నెగటివ్ టాక్ తెచ్చుకోవడం అని అంటున్నారు.
ఇప్పటికే కెరీర్ పరంగా ఇటీవల పెద్దగా సక్సెస్ ట్రాక్ లేని శంకర్, తమ హీరో సినిమాని ఏమి చేస్తారో ఏమో అనేది వారి ఆవేదన. అయితే గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీని కార్తీక్ సుబ్బరాజ్ అందించడంతో పాటు శంకర్ అండ్ టీమ్ ఎంతో జాగ్రత్తగా మాస్ పొలిటికల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా గేమ్ ఛేంజర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటోంది టాలీవుడ్ లోని ఒక వర్గం. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.