మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండేళ్ల క్రితం మరొక స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటించారు. ఆ మూవీలో చరణ్ అల్లూరిగా కనిపించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేసారు. రిలీజ్ అనంతరం గ్లోబల్ గా ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ఆర్ఆర్ఆర్ ఆ ఇద్దరు స్టార్స్ కి వరల్డ్ వైడ్ ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టింది.
ఓవైపు ఎన్టీఆర్ ప్రస్తతం కొరటాల శివతో దేవర పార్ట్ 1 మూవీ చేస్తుంటే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు చరణ్. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న గేమ్ ఛేంజర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన జరగండి సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత నుండి మూవీకి సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా లేకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు కమల్ తో భారతీయుడు 2 మూవీ తీసిన శంకర్, త్వరలో గేమ్ ఛేంజర్ బ్యాలన్స్ షూట్ పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ సహా ఇతర కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు శంకర్ అండ్ టీమ్ గట్టిగా వర్క్ చేస్తోందట. మరి ఈ ఏడాదైనా పాపం చరణ్ ఫ్యాన్స్ కోరిక తీరి తమ అభిమాన హీరో మూవీని తెరపై చూడగలరో లేదో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.