తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీని శంకర్ తెరకెక్కించగా హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఘోరంగా డిజాస్టర్ అయింది.
అయితే దీని అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు రామ్ చరణ్. RC 16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ సెట్స్ కి తన కుమార్తె క్లిన్ కార ని తీసుకువచ్చారు రామ్ చరణ్. ముద్దులొలికే తన కుమార్తెతో కలిసి రామ్ చరణ్ దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వీలైనంత త్వరలో ఈ మూవీ యొక్క షూట్ ని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఏ ఆర్ రహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి