Homeసినిమా వార్తలుTRP రేటింగుల రెస్ లో వెనకబడిన ఆర్ ఆర్ ఆర్

TRP రేటింగుల రెస్ లో వెనకబడిన ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) ఎంతటి ఘన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తరువాత ఒటీటి లో కూడా తన హవాను కొనసాగించింది. కాగా ఈ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది.

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను అద్భుతంగా చూపిన ఈ చిత్రంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ నటనతో కూడా మెప్పించారు. తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కింది ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలను అందుకుంటూ ప్రేక్షకులందరినీ అలరించింది. కరోనా దాడుల వల్ల అనేక సార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా భాషలకు అతీతంగా ఖ్యాతిని గడించింది.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక థియేటర్లలో రన్ ముగిసిన తరువాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ కాబడింది. ఆ క్రమంలో, ఈ సినిమా అంతర్జాతీయ గుర్తింపను సొంతం చేసుకుంది. హాలీవుడ్ లోని ప్రేక్షకులతో పాటు అక్కడి సెలబ్రిటీలకు సైతం ఆర్ ఆర్ ఆర్ ఎంతగానో నచ్చింది.

READ  Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

ఇక ఈ చిత్రం గత ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ అయి టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6(urban), 18.36 (urban+rural) టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది… అయితే ఇది ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాకు రావాల్సిన రేటింగ్ కాదని అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అంత ప్రజాదరణ పొందిన సినిమాకు ఇంత తక్కువు రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫిదా, రంగస్థలం వంటి సినిమాల కంటే ఆర్ ఆర్ ఆర్ తక్కువగా రావడం ఏంటని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక తెలుగులో టీఆర్పీ రేటింగ్ పరంగా రికార్డు సృష్టించిన సినిమాల విషయానికి వస్తే.. అల వైకుంఠపురములో (29.4), సరిలేరు నీకెవ్వరు, (23.4) బాహుబలి 2 (22.7) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రభాస్ సాలార్ విడుదల తేదీ ఖరారు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories