భారతదేశపు ప్రముఖ దర్శకులలో ఒకరైన దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మాతగా కూడా మంచి చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నిర్మించగా ఎన్.ఎస్.పొన్కుమార్ దర్శకత్వంలో నటుడు గౌతమ్ కార్తీక్ నటించిన 16 ఆగస్టు 1947 చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తాను దర్శకత్వం వహించిన దర్బార్ చిత్రం గురించి మాట్లాడారు.
దర్బార్ ఫెయిల్యూర్ కు కారణం రజినీకాంత్ పొలిటికల్ ప్లాన్స్ ఏ అని మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతి సినిమా గెలవడానికి ఒక కారణం ఉంటే, ఓడిపోవడానికి కూడా ఒక కారణం ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి సినిమా మా మొదటి సినిమాలాగే ఉంటుంది. అలానే ఈ ఓటమి కూడా ఫ్రెష్ ఎక్స్ పీరియన్స్ అని ఆయన అన్నారు.
ఇక దర్బార్ విషయానికొస్తే, ఆ సినిమా చిత్రీకరణ సమయంలో రజినీ సార్ తనకు డేట్ ఇచ్చారని, మార్చిలో ప్రారంభించాలని చెప్పారని మురుగదాస్ చెప్పారు. బొంబాయిలో వర్షాకాలం జూన్ లో ప్రారంభమవుతుంది. అలాగే, రజనీ ఆగస్టులో పార్టీని ప్రారంభించబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే ఫిబ్రవరిలో షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. తాను రజినీ అభిమానినని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను మిస్ చేసుకోవాలని అనుకోలేదని ఏఆర్ మురుగదాస్ తెలిపారు.
అయితే మార్చిలో షూటింగ్ జరిగింది. కానీ ఈ సినిమా జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. దాంతో మురుగదాస్ ఎలాగైనా ఈ సినిమా మిస్ అవ్వకుకూడదని భావించి కథా కథనాల పట్ల దృష్టి సారించకుండానే అనుకున్న సమయంలో చకచకా పూర్తి చేశారు. కాగా ఈ ఇంటర్వ్యూలో మురుగదాస్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ చెప్పిన మాటలను ను గుర్తు చేసుకున్నారు.
ఆమీర్ ఖాన్ తనకు ఓ పెద్ద సీక్రెట్ చెప్పారని ఆయన అన్నారు. అదేమిటంటే.. ఒక సినిమా రిలీజ్ డేట్ ని మొదట్లోనే అనౌన్స్ చేస్తే అప్పుడే ఆ సినిమా 50% ఫ్లాప్ అవుతుంది. ఆయన చెప్పినట్లుగానే అది నిజమని దర్బార్ సినిమా సమయంలోనే అర్థమైంది అన్నారు మురుగదాస్.