Homeసినిమా వార్తలుRajinikanth: షూటింగ్ చివరి దశలో రజినీకాంత్ జైలర్

Rajinikanth: షూటింగ్ చివరి దశలో రజినీకాంత్ జైలర్

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో ‘తలైవర్ 169’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్ ను ఖరారు చేసి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.

ఇటీవలే 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జైలర్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రజినీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ల పై ఇటీవల కొన్ని సన్నివేశాలను చిత్రీకరించగా, మరి కొందరు ప్రముఖ నటులు కూడా ప్రస్తుత షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

ఏప్రిల్ రెండో వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పనులు చిత్ర బృందం చేపట్టనుంది. రజినీకాంత్, నెల్సన్ ఇద్దరి గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలు చవిచూడటంతో ఈ సినిమా ఫలితం ఇద్దరికీ కీలకంగా మారింది.

READ  Sir: రేపు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్న ధనుష్ సార్ (వాతి) టీం

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ , రమ్య కృష్ణ, సునీల్ , తమన్నా మొదలగు భారీ తారాగణం నటిస్తున్నారు.

రిటైర్డ్ జైల్ వార్డెన్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ నటిస్తుండగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డార్క్ కామెడీ ఫార్ములాతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అని సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన మూడో చిత్రం కావడంతో ఆయన పనితనం అద్భుతంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Kabzaa: ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా నకిలీ కలెక్షన్ల ప్రకటన - 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసిన కబ్జా టీం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories