కోలీవుడ్ స్టార్ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వెట్టయాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. టీజె జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ అనంతరం ఆశించిన స్థాయి విజయం అయితే అందుకోలేదు. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శికత్వంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలి మూవీలో నటిస్తున్నారు రజినీకాంత్.
దీని అనంతరం త్వరలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 లో కూడా నటించనున్నారు. మరోవైపు మణిరత్నంతో కూడా ఆయన ఒక సినిమా చేయనున్నారు. మొత్తంగా అయితే ఈ మూడు సినిమాలతో రజిని బిజీ కానున్నారు. విషయం ఏమిటంటే డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రీట్స్ తో పాటు దళపతి మూవీ కూడా రజిని బర్త్ డే రోజన రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
మొత్తంగా ఈ మూడు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్లు అలానే పోస్టర్ల అనౌన్స్మెంట్ కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా అతి త్వరలో అవకాశం ఉంది. ఇక 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలని సొంతం చేసుకోవాలని కోరుకుందాం