Home సినిమా వార్తలు కూలీ : నాగార్జున సైమన్ పాత్ర పై రజిని సెన్సేషనల్ కామెంట్స్ 

కూలీ : నాగార్జున సైమన్ పాత్ర పై రజిని సెన్సేషనల్ కామెంట్స్ 

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ కూలి. ఈమూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక తాజాగా జరిగిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు ఆడియన్స్ ని ఒక వీడియో బైట్ ద్వారా మూవీ ఆదరించాలని కోరారు. ఇక ఆ వీడియోలో రజిని మాట్లాడుతూ, ముందుగా ఇందులోని నెగటివ్ పాత్ర అయిన సైమన్ పాత్ర తాను చేద్దాం అనుకున్నానని అన్నారు.

అయితే తాను హీరోగా ఫిక్స్ అయిన అనంతరం ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు అని లోకేష్ ని అడగగా ఫైనల్ గా నాగార్జున ని ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఇక మూవీ ఫస్ట్ రోజు షూట్ లో భాగంగా నాగార్జున లుక్ ని చూసిన తాను షాక్ అయ్యాయని, ఆయన పాత్ర తనకు ఎంతో నచ్చిందని, ఆ పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుందని అన్నారు. మొత్తంగా నాగార్జున ఆ పాత్ర లో ఎంతో బాగా యాక్ట్ చేసారని చెప్పుకొచ్చారు రజినీకాంత్. మరి ఆగష్టు 14న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version