Homeసినిమా వార్తలురజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ జైలర్

రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ జైలర్

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకుడుగా భాధ్యత వహిస్తున్న ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది.జైలులోని ఖైదీలు నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన అందాల భామ ఐశ్వర్యరాయ్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే రోబో సినిమా తర్వాత మరోసారి వీరి జంటను వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనుందన్నమాట. నటి ప్రియాంక మోహన్‌ మరో పాత్రలో నటించనున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్‌ రవికుమార్, కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్, హీరో శివకార్తికేయన్‌ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు గట్టి ప్రచారం జరుగుతుంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్‌ నటుడిగా 47ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నా రు. దీంతో జైలర్ చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్‌ ఆ రోజున విడుదలయ్యే అవకాశముంది.

గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ హిట్ లేని సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సినిమాతో తిరిగి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతారు అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇటీవల సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ విక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా రజినీకాంత్ కూడా పెద్ద హిట్ సినిమా అందిస్తాడేమో చూద్దాం.

READ  Sai Pallavi: సాయి పల్లవి పై కేసు నమోదు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories