HomeRajinikanth Coolie Release Date Locked రజినికాంత్ 'కూలీ' రిలీజ్ డేట్ లాక్
Array

Rajinikanth Coolie Release Date Locked రజినికాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్ లాక్

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వెట్టయాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. టీజె జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ. ఈ మూవీలో నాగార్జున, శృతిహాసన్, సత్య రాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా సన్ పిక్చర్స్ సంస్థ పై దీనిని గ్రాండ్ లెవెల్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

ఇటీవల టైటిల్ గ్లింప్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న కూలీ మూవీకి గిరీష్ గంగాధరన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా కూలీ మూవీ రిలీజ్ డేట్ ఐతే లాక్ అయింది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే 1న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

అయితే అదే రోజున నాని హీరోగా రూపొందుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3 ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా తెలుగులో ఒకరకంగా కూలీ మూవీకి థియేటర్స్ కేటాయింపుల విషయంలో హిట్ 3 అయితే అడ్డొస్తుంది. మరి పక్కాగా ఈ మూవీస్ రెండూ ఒకేరోజు రిలీజ్ అవుతాయా లేక ఏదైనా డేట్ చేంజ్ అవుతుందా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

READ  Vettaiyan Sure Shot Blockbuster'వేట్టయాన్' బ్లాక్ బస్టర్ పక్కానా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories