తమిళ స్టార్ నటుల్లో ఒకరైన వెర్సటైల్ యాక్టర్ సూర్య తాజాగా నటిస్తున్న సినిమా కంగువా. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు ఇటీవల ఆనిమల్ లో అదరగొట్టిన విలన్ పాత్రధారి అయిన బాబి డియోల్ ఇందులో నెగిటివ్ పాత్ర చేస్తున్నారు. అలానే సూర్య తమ్ముడు కార్తి ఇందులో ఒక క్యామియో పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక అక్టోబర్ 26న ఈ సినిమా యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా జరగనుంది.
విషయం ఏమిటంటే ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారని ఇప్పటికే దానికి సంబంధించి భరీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే దీనిపై ఆ మూవీ యొక్క మేకర్స్ నుంచి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా కంగువ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్ సంసిద్ధమవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తమ హీరో కెరీర్ లో పెద్ద సంచలన అందిస్తుందని సూర్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.