Homeసినిమా వార్తలుఆస్కార్స్ కు ఎంపికవని RRR.. నిరాశలో తెలుగు సినీ అభిమానులు

ఆస్కార్స్ కు ఎంపికవని RRR.. నిరాశలో తెలుగు సినీ అభిమానులు

- Advertisement -

RRR.. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించింది అనేది అందరికీ తెలిసిందే. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిచిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరించింది. ఇక ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి ఎంతో ఆకర్షితులయ్యారు.

అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు కలిగిన ఓటిటి ప్లాట్‌ఫాం అయిన ‘నెట్ ఫ్లిక్స్’లో ప్రపంచవ్యాప్తంగా మూడువారాలు పాటు వరసగా ట్రెండ్ లో నిలిచింది అంటే.. ఈ సినిమా అన్ని సరిహద్దులు దాటి ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్ధమవుతుంది. కాగా, ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఇటు భారతీయ ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మరియు హాలీవుడ్ సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు కూడా ఆశించారు.

అయితే భారత ప్రభుత్వం వీటన్నిటికీ విరుద్ధంగా.. అందరి ఆశలను తలకిందులు చేస్తూ.. ఇండియా నుంచి ఆస్కార్స్ కు గుజరాతీ ఫిల్మ్ అయిన “చలో షో లాస్ట్ షో” సినిమాని ఎంపిక చేసింది. అన్నీ అర్హతలు ఉన్నా ‘ఆర్ఆర్ఆర్’ ని ఆస్కార్స్ కు ఎంపిక చేయకపోవడంతో, రాజకీయ కారణాల వల్లే ఇలా చేసారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

READ  నా మార్కెట్ ఎంటో నాకు తెలుసు - శర్వానంద్

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ యేడాది మన దేశం తరుపున ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరు భావించారు. అయితే పైన చెప్పుకున్నట్లుగా ఈ విషయంలో అందరికీ నిరాశే మిగిలింది.

ఇంతకీ RRR సినిమాకు బదులు మన దేశం తరుపున ఎంపికయిన సినిమా ఏదంటే.. ‘చలో షో లాస్ట్ షో’ అనే గుజరాతీ సినిమా మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలుస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2023 ఆస్కార్ బరిలో మన దేశం తరుపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.

బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఎంపికైన ఈ సినిమాను డైరెక్టర్ నలిన్ తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. అతను చిన్నపుడు సినిమాల పై ఎలా ఆకర్షితుడు అయ్యాడు. సినిమాల పై ఎలా ఇష్టాన్ని పంచుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మన దేశం తరుపున 2023లో ఆస్కార్ బరిలో నిలవనుంది

Follow on Google News Follow on Whatsapp

READ  RRR ఆస్కార్ రేస్ లో గెలుస్తుందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories