Homeసినిమా వార్తలురాజమౌళికి దక్కనున్న అరుదైన గౌరవం

రాజమౌళికి దక్కనున్న అరుదైన గౌరవం

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించ దగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మగధీర ‘, ‘ఈగ’, మరియు బాహుబలి సీరీస్ లతో ఆయన ఖ్యాతి అమాంతం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మారు మ్రోగెలా చేశాయి. ఆ చిత్రాలకు కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్స్ దాకా పాచుర్యం పొందారు. ఇక ఇటీవలే విడుదలయిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో రాజమౌళి పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే అలాంటి అనుమానాలను ఆర్ ఆర్ ఆర్ పటా పంచలు చేసింది. మార్చిలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించింది అనేది తెలిసిన విషయమే. ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తరువాత అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ హిందీ లో రీ రిలీజ్ అవ్వడం.. నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాక అంతర్జాతీయ ప్రేక్షకులతో పాటు పలువురు హాలీవుడ్ సినిమా నిపుణుల్ని సైతం విశేషంగా ఆకట్టుకుంది. అలా కేవలం కలెక్షన్లు మాత్రమే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఎనలేని కీర్తిని ఆర్జించిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది.

హాలీవుడ్ మేకర్స్ సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను మెచ్చుకోగా.. సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన రామ్ చరణ్ కి కూడా హాలీవుడ్ ఆఫర్స్ వస్థాయి అన్న వార్తలు వచ్చినా, భీమ్ గా అలరించిన ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుకు ఎంపిక అవుతారా అనే వార్త ప్రచారంలో ఉన్నా అవన్నీ కూడా రాజమౌళి కష్టానికి ఫలితం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించబోతుంది.

READ  కార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్

అమెరికాలో జరిగే ప్రఖ్యాత హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలు ప్రదర్శనకి ఎంపికయ్యాయి. హాలీవుడ్ లో జరిగే అతిపెద్ద ఫిల్మ్ పెస్టివల్స్ లో బియాండ్ ఫెస్ట్ ఒకటి. ఈ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు. సెప్టెంబర్ 17 నుంచి ఆక్టోబర్ 11 వరకూ జరిగే ఈ వేడుకల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలని ప్రదర్శిస్తున్నారు.

సెప్టెంబర్ 30న ఆర్ ఆర్ ఆర్.. అక్టోబర్ 1న ఈగ సినిమాతో పాటు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలను ప్రదర్శిస్తారు. అలాగే అక్టోబర్ 21న మర్యాద రామన్న సినిమాని ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు రాజమౌళి అతిధిగా వెళ్లనున్నారు. అలాగే ఈ సందర్భంగా నిర్వాహకులు రాజమౌళిని ఘనంగా సన్మానించనున్నారు. ఇది నిజంగా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆ పచ్చబొట్టు తీసేయను - నాగ చైతన్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories