సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ గా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు. తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక పవర్ఫుల్ పాత్రని మహేష్ బాబు పోషించనున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా దర్శకడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ అండ్ టీమ్ తో కలిసి ప్రత్యేకంగా ఈ మూవీ యొక్క లొకేషన్స్ వేటలో భాగంగా సౌత్ ఆఫ్రికా, కెన్యా వంటి దేశాల్లోని పలు కీలక ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.
దానికి సంబందించి ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క బడ్జెట్ రూ. 1000 కోట్లకు పైగా ఉండనుండగా ఇందులో ఇండియా తో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు పలువురు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని వీలైనంత త్వరలో అనౌన్స్ చేసి రానున్న 2025 సంక్రాంతి అనంతరం పట్టాలెక్కించడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.