టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ క్రేజ్, సూపర్ యాక్టింగ్, స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ మూవీ రాజకుమారుడుతోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ సెన్సేషన్ కొట్టిన మహేష్ బాబు తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఫాన్స్ ని ఆడియన్స్ మెప్పించారు.
అనంతరం తన సినీ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ముందుకి సాగిన మహేష్ కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పుకునే కొన్ని సినిమాల్లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మూవీ బిజినెస్ మాన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య భాయ్ అనే పవర్ఫుల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా రోల్ లో మహేష్ బాబు కనిపించారు.
ఇక ఈ పాత్రలో ఆయన అత్యద్భుత నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కాయి. అప్పట్లో అతిపెద్ద విజయం అందుకున్న ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ లో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో అవుతున్నాయి.
ఒక సినిమాని ఎలా సక్సెస్ చేయాలి అనే అంశంపై తను ఎంతో కష్టపడి పుస్తకం రాసుకున్నానని, అయితే పూరీ తెరకెక్కించిన బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు మార్వలెస్ యాక్టింగ్ చూసి ఆ విధంగా నెగిటివ్ షేడ్స్ తో పాటు హీరో బూతులు మాట్లాడటం వంటి వాటితో మూవీ పెద్ద సక్సెస్ కొట్టడం ఆశ్చర్యపరిచిందట. అది చూసిన జక్కన్న వెంటనే తన సక్సెస్ బుక్ ని చించేశారట. ఆ విధంగా స్టార్ యాక్టర్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల బిజినెస్ మ్యాన్ కి ఫిదా అయ్యారట రాజమౌళి.