టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చేయనున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 పై రోజురోజుకు అందరిలో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తొలిసారిగా రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయిన ఈ మూవీ కోసం ఇప్పటికే మహేష్ బాబు బల్క్ గా బాడీని అలానే ఫుల్ గా క్రాఫ్, గండం పెంచుతున్నారు. ఇక ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పటినుండి అప్ డేట్స్ వస్తాయి అనే దానిపై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది.
తాజాగా శ్రీసింహా కోడూరి నటించిన మత్తువదలరా మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా SSMB 29 మూవీ అప్ డేట్ ఎప్పుడు ఉంటుందని తన బాబాయ్ రాజమౌళిని హీరో శ్రీసింహా అడగడంతో జక్కన్న సరదాగా ఒక్కసారిగా ఫైర్ అవ్వడం గమనించవచ్చు. కాగా రాజమౌళి సరదా షాకింగ్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బట్టి ఈ మూవీ అనౌన్స్ మెంట్ రావడానికి మరికొంత సమయం ఉందని తెలుస్తోంది.