దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. 2023 చివర్లో భారీ స్థాయిలో వర్క్ షాప్ లతో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఆరు నెలల పాటు కొనసాగే ఈ ప్రక్రియలో వివిధ విభాగాలకు రాజమౌళి వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కాబట్టి విఎఫ్ఎక్స్ కంపోజిషన్, గ్రీన్ కార్పెట్ల వాడకం, ఇతర అంశాల పై చిత్ర యూనిట్ వర్క్ షాప్ నిర్వహించనుందని సమాచారం.
కాగా రాజమౌళి మహేష్ బాబుతో తీయబోయే ఈ సినిమాను తన మునుపటి సినిమాల కంటే భారీ స్థాయిలో తీస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న ఆయన మహేష్ సినిమాను మూడు భాగాలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమ అభిమాన హీరో రాజమౌళితో సినిమా చేస్తాడనే వార్తతో మహేష్ బాబు అభిమానులు క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రయాలజీ వార్త నిజమైతే మరింత వారు ఉత్సాహంగా ఉంటారు.
SSMB 29 అనే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇండియానా జోన్స్ తరహాలో సాగే అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా ఉంటుందని, అయితే మరింత మోడ్రన్ గా, సెట్టింగ్ లో మరింత విపులంగా ఉంటుందని రాజమౌళి ఇదివరకే చెప్పారు. ఈ సినిమాలో మహేష్ బాబు కొన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లలో కనిపించనున్నారు.
ప్రస్తుతం మహేష్ SSMB28 సినిమా చేస్తున్నారు. కాగా పూజా హెగ్డే, శ్రీలీల, జగపతిబాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.’అతగడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. సంగీత దర్శకుడు ఎస్.థమన్ సంగీతం ఈ చిత్రానికి అందిస్తున్నారు. ఈ సినిమా 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.