టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దిగ్గజ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకక్కనున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబడ్ స్టార్టింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు కనిపించనటువంటి ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా దీనికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో కేల్ నారాయణ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా యొక్క లొకేషన్స్ యొక్క వేటలో భాగంగా సౌత్ఆఫ్రికా, కెన్యా వంటి దేశాల్ని తన టీంతో కలిసి చుట్టేస్తున్నారు జక్కన్న రాజమౌళి. అందులో భాగంగా ఇప్పటికే ఆ లొకేషన్స్ తాలూకు కొన్ని పిక్స్ ని అలానే వీడియోలను కూడా రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ కూడా సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు కి శిఖరం రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ బాబ్ జూనియర్ అనే సింహం యొక్క పిక్ ని తన ఇన్స్టా ఐడిలో పోస్ట్ పోస్ట్ చేశారు రాజమౌళి. ప్రస్తుతం అది సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తోంది. రీల్ పై అందరు హీరోలకి ఎలివేషన్ ఇవ్వటం కామన్ అని కానీ రియల్ హీరోగా మహేష్ బాబుకి ఇండియాలోని టాప్ దర్శకుడయిన రాజమౌళి ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వటం గ్రేట్ అని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్. మొత్తంగా అయితే ప్రీ ప్రొడక్షన్ లొకేషన్స్ వేటలో భాగంగా ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ పట్టాలెక్కనుంది.