Homeసినిమా వార్తలుRajamouli: రస్సో బ్రదర్స్ అభిమానం చూరగొన్న రాజమౌళి

Rajamouli: రస్సో బ్రదర్స్ అభిమానం చూరగొన్న రాజమౌళి

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్ ` సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. 1100 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలోనే భారీ విజయాలలో ఒకటిగా నిలిచింది.

అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ ఎంతగా ప్రభావం చూపిందంటే అక్కడ హిందీ వెర్షన్ ను ఏకంగా రీ రిలీజ్ చేశారు.ఆ స్పెషల్ షో ద్వారా `ఆర్ ఆర్ ఆర్` హాలీవుడ్ మేకర్లకి కూడా దగ్గరైంది. ఇక ఓటీటీ రిలీజ్ తో `ఆర్ ఆర్ ఆర్` స్థాయి ఒక్క సారిగా మారిపోయింది. హాలీవుడ్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ కి హాలీవుడ్ అవకాశాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద భీమ్ పులులతో వచ్చే సన్నివేశం చూసి హాలీవుడ్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ సీన్ ను పొగుడుతూ ఒక ట్వీట్ ఏకంగా 10 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది అంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఏ స్థాయిలో విదేశీయులను ఆకట్టుకుందో అర్థం అవుతుంది. అసలు ఆర్ ఆర్ ఆర్ కి గ్లోబల్ స్థాయిలో ఇంత ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని, హాలీవుడ్ కి ఈ స్థాయిలో రీచ్ అవుతుందని ఆ చిత్ర యూనిట్ సైతం అనుకుని ఉండరు. ఈ చిత్రానికి దక్కిన అపారమైన క్రేజ్ తో తదుపరి మహేష్ తో తీయబోయే సినిమాని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించే అవకాశం రాజమౌళికి దక్కిందని చెప్పవచ్చు.

READ  ఉత్కంఠ రేపిన "కార్తికేయ 2" ట్రైలర్

తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్ లో అక్టోబర్ లో విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ ఇంకెన్ని రికార్డులని సాధిస్తుందో, ఇంకెన్ని ప్రశంసలు అందుకుంటుందో చూడాలి. గతంలో బాహుబలి సీరీస్ జపాన్ లో విడుదలై విజయం సాధించింది.

https://twitter.com/Sreenu089/status/1550160141625962497?t=HW6tdfPAYHRg_G7X8rRyVg&s=19

ఇక ఆర్ ఆర్ ఆర్ మరియు రాజమౌళి ఖాతాలో మరో అరుదైన అభిమాన గణం చేరారు. హాలివుడ్ ప్రఖ్యాత దర్శకులు రూసో బ్రదర్స్‌ (జో రూసో-ఆంటోనీ రూసో) .. వీరు దర్శకత్వం వహించిన అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ వంటి సినిమాలు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. తాజాగా రస్సో బ్రదర్స్.. మార్క్ గ్రేనీ నవల ఆధారంగా ‘ది గ్రే మ్యాన్‌’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మన దక్షిణాది నటుడు ధనుష్ ఒక ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఇందులో ర్యాన్‌ గోస్లింగ్, క్రిస్‌ ఎవాన్స్, అనా డి అర్మాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 15న థియేటర్లలో విడుదల కాగా జూలై 22న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

READ  Box-Office: రజినీకాంత్ తరువాత మళ్ళీ కమల్ ఆ రికార్డ్ కొట్టారు

ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో భాగంగా రస్సో బ్రదర్స్ ఒక ప్రశ్నకు బదులిస్తూ, ఆర్ ఆర్ ఆర్ చిత్రం తమకు ఎంతగానో నచ్చిందని, రాజమౌళితో కలిసి పని చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది ఖచ్చితంగా రాజమౌళికి, మన తెలుగు సినీ పరిశ్రమకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories