Home సినిమా వార్తలు Raayan OTT Release ‘రాయన్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Raayan OTT Release ‘రాయన్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

raayan

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన లేటెస్ట్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాయన్. ఈ మూవీని ధనుష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించగా ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.

సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, దూశరా విజయన్, ప్రకాష్ రాజ్, కాళిదాస్ జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈమూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. తమిళ్ తో పాటు రాయన్ మూవీ తెలుగులో కూడా బాగానే ఆడింది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన రాయన్ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకుంది.

కాగా ఈ మూవీని ఆగష్టు 23న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషలో ఓటిటి ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వారు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో అందరినీ ఆకట్టుకున్న రాయన్ మూవీ ఎంతమేర ఓటిటిలో అలరిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version