ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ క్యూ2 త్రైమాసిక ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో.. పీవీఆర్ సంస్థ రూ. 71.23 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే(రూ. 153.13కోట్ల లాభం).. ఇది 53 శాతం తక్కువ.
కాగా.. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం రూ. 686.72కోట్లుగా నమోదైంది. ఎఫ్వై23 క్యూ1లో రూ. 120.32కోట్ల ఆదాయాన్ని పీవీఆర్ గడించింది. అదే సమయంలో పీవీఆర్ పూర్తి ఆదాయం.. రూ. 703.13కోట్లుగా నిలిచింది. గత త్రైమాసికంలో అది రూ. 275.21 కోట్లుగా ఉంది.
ఈ త్రైమాసికంలో అడ్మిషన్లు మరియు సగటు టిక్కెట్ ధరలు బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాల నాసిరకమైన పనితీరుతో ప్రభావితమయ్యాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో PVR తెలిపింది.
ఈ త్రైమాసికంలో బాలీవుడ్ సినిమాల ప్రదర్శన ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉందని గుర్తించబడింది. ఈ మల్టీప్లెక్స్ చెయిన్లో ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ తప్ప, ‘లాల్ సింగ్ చద్దా’, ‘రక్షా బంధన్’, ‘లైగర్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు వాటి పై ఉన్న అంచనాల కంటే చాలా తక్కువగా ప్రభావం చూపాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు.. ఆ తరువాత విడుదలైన చలనచిత్రాలు ప్రస్తుత వినియోగదారులకు ఉన్న ప్రాధాన్యతలతో సరిపోవకపోవడం, స్టార్ ఇమేజ్ కన్నా కంటెంట్ కే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో పాటు కొందరు బాలీవుడ్ స్టార్లు మరియు వారి సినిమాల పై సోషల్ మీడియాలో నెలకొన్న ప్రతికూల ప్రచారాల కారణంగా హిందీ చిత్రాల పనితీరు ఈ సంవత్సరం దిగువ స్థాయిలో ఉండింది.
అలాగే, PVR మల్టీ ప్లెక్స్ వద్ద టికెట్ రేట్లు మరియు తినుబండారాల ధరలు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండకపోవడం కూడా ఈ నష్టానికి కారణంగా చెప్పవచ్చు. అయితే, స్టార్ హోటల్ లాంటి వాతావరణం, ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన సినిమా అనుభవం కావాలంటే ఆ మాత్రం ఖర్చు చేయాలి అని మరి కొందరు వాదిస్తున్నారు.
అయితే ఈ వాదోప వాదనలు పక్కన పెడితే ప్రాంతీయ సినిమాలు మాత్రం తమ జోరును PVR వద్ద కొనసాగించాయి. ప్రాంతీయ సినిమాల బాక్సాఫీస్ సహాయం Q2 FY20లో 28% నుండి Q2 FY23లో 44%కి పెరిగింది. ఇది ఖచ్చితంగా PVR సంస్థకు భరోసా కలిగించే ధోరణి అని చెప్పాలి.
ఇదిలా ఉండగా, PVR మల్టీప్లెక్స్ చైన్ తన ప్రత్యర్థి INOX సంస్థతో ఆల్-స్టాక్ డీల్‌లో విలీనం కానుంది మరియు 109 నగరాల్లో 1,546 స్క్రీన్‌లతో భారతదేశపు అతిపెద్ద ఎగ్జిబిషన్ సంస్థగా అవతరించినుంది.