Home సినిమా వార్తలు Pushpa2: పుష్పరాజ్ ఈసారి మాస్ కాదు.. అల్ట్రా క్లాస్!

Pushpa2: పుష్పరాజ్ ఈసారి మాస్ కాదు.. అల్ట్రా క్లాస్!

Allu Arjun To Be Seen Ultra Style In Pushpa 2
Allu Arjun To Be Seen Ultra Style In Pushpa 2

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ ఊరమాస్ మూవీగా తెరకెక్కించగా, పుష్పరాజ్ అనే మాస్ అవతారంలో బన్నీ లుక్ అందరినీ అబ్బురపరిచింది. ఇలాంటి పాత్రను ఓ స్టార్ హీరో చేయాలంటే చాలా కష్టం. కానీ.. బన్నీ ఈ పాత్రను హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్. ఇక పుష్ప తొలిభాగం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను మరింత గ్రాండియర్‌గా తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను పుష్ప పార్ట్ 1 కంటే కూడా మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. పుష్ప తొలిభాగంలో ఓ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీ నుండి సిండికేట్‌కు ఓనర్‌గా ఎదుగుతాడు పుష్పరాజ్. ఇక రెండో భాగంలో ఈ సిండికేట్‌ను పుష్పరాజ్ ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా తీసుకెళ్లాడనేది మనకు చిత్ర యూనిట్ చూపించబోతుంది.

కాగా, తొలిపార్ట్‌లో బన్నీని ఊరమాస్ అవతారంలో చూపించిన సుకుమార్, రెండో పార్ట్‌లో స్టైలిష్‌గా చూపించబోతున్నాడని తెలుస్తోంది. అప్పుడు కూలీగా కనిపించాడు కాబట్టి, బన్నీని అంత మాస్ లుక్‌లో చూపించామని.. ఇప్పుడు సిండికేట్ ఓనర్‌గా బన్నీ అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు కాబట్టి, ఆయన లుక్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version