Homeసినిమా వార్తలుPushpa-The Rule: పెద్ద ప్లాన్ లో ఉన్న సుకుమార్

Pushpa-The Rule: పెద్ద ప్లాన్ లో ఉన్న సుకుమార్

- Advertisement -

అల్లు అర్జున్ పుష్ప ది రూల్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి అలరించనున్న ఈ చిత్రం ప్రధానంగా పుష్ప vs షేకావత్ మధ్య యుద్ధం లా ఉండబోతుంది. షేకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్‌ మొదటి భాగంలో కొంత సేపే ఉన్నప్పటికీ రెండో భాగంలో మాత్రం ఆయన పాత్ర పుష్ప తో పోటీ పడుతుందట. అల్లు అర్జున్ – ఫహద్ ఫాసిల్‌ ల మధ్య అటు సినిమాలో పాత్రధారులుగా ఇటు నటులుగా అద్భుతమైన పోటీని మనం చూడబోతున్నాం అన్నమాట.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పుష్ప: ది రూల్ సినిమాకు ఇప్పుడు సుకుమార్ కేవలం దర్శకుడి గానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారట. ఆయన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ చిత్రం నిర్మించబడుతుంది. పుష్ప ది రైజ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ముత్తంశెట్టి మీడియా సహ నిర్మాతలుగా చేరారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న పుష్ప ది రూల్ కు ఇప్పుడు ముతంశెట్టి మీడియా స్థానంలో సుకుమార్ రైటింగ్స్‌ ప్రవేశించింది.

అత్యంత భారీ క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని ఏదో ఆషామాషిగా తీయడానికి సుకుమార్ ఏ మాత్రం తొందరపడటం లేదు. సినిమాకు సంబందించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నిటితో సంతృప్తి చెందిన తర్వాత మాత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. అందుకే చాలా విరామం తీసుకుని ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

READ  ఈ వారం సినిమాలు ఇండస్ట్రీ ఆశలు నిలబెడతాయా?

ఇక సినిమా కథాంశం విషయానికి వస్తే, టైటిల్ సూచించినట్లుగా, ఈ చిత్రం పుష్ప ఎదుగుదలను అద్భుతంగా ప్రదర్శించనుందని తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో కేవలం చిత్తూరు, తమిళనాడు కాకుండా ఏకంగా అంతర్జాతీయ నేపథ్యంలో తెరెక్కనుందట. అంటే హీరోగా అల్లు అర్జున్ ఉన్న క్రేజ్ కు తగ్గట్టే పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ కు ఎందరో విరోధులు ఉంటారట. అలా పుష్పరాజ్ పాత్ర ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే విధంగా సినిమా ఉంటుందట. ముందుగా చెప్పుకున్నట్లు పుష్ప 2 లో ఫహద్ ఫాసిల్ ఈసారి బలమైన పాత్రను కలిగి ఉంటారని సమాచారం. అంతే కాకుండా ఆయన పాత్ర చిత్రణ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాలూకు థియేట్రికల్ రైట్స్ ₹145.5 కోట్లకి జరుపుకుంది. ఇక తన మొత్తం రన్ అయ్యాక వ్యాపారంలో 120% రికవరీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇతర భాషల్లో చక్కని రన్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీలో ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అయింది. మరి పుష్ప 2 ఏ స్థాయిలో ఆడుతుందో ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  అమీర్ ఖాన్ సినిమాను తెలుగులో సమర్పించనున్న మెగాస్టార్ చిరంజీవి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories