‘పుష్ప: ది రైజ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ ‘పుష్ప: ది రూల్’ సినిమా యొక్క ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో జరుగుతున్న జాప్యానికి రోజురోజుకీ అభిమానులు అసహనానికి గురవుతున్నారు మరియు వీలైనంత త్వరగా సినిమా గురించి ఏదైనా అప్ డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక అభిమానులని అలరించడానికి పుష్ప 2 కి సంబంధించిన ఫస్ట్ మేజర్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని పుష్ప టీమ్ డిసైడ్ అయ్యింది. కాగా ఆ అప్డేట్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ రకంగా సంక్రాంతి పండుగ సీజన్ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేయనున్నారన్నమాట.
2024 సంక్రాంతికి పుష్ప 2 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ ఉన్న ఈ సినిమాకు పండుగ విడుదల తేదీని జోడిస్తే, అది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుందని యూనిట్ నమ్ముతోంది.
కాగా కెజిఎఫ్ 2 ను లాగే సీక్వెల్ హైప్ తో భారీ క్రేజ్ ను రాబట్టవచ్చు అని వారు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాని అంతర్జాతీయ మార్కెట్లలో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.
టైటిల్ కు తగ్గట్టుగానే ఈ చిత్రం పుష్ప యొక్క పరిపాలనను మరింత ఎత్తుకు తీసుకువెళుతుంది. పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ పాత్ర అన్ని అడ్డంకులను దాటేసి అంతర్జాతీయ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుంది. రష్మిక మందన్న శ్రీవల్లిగా, ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో పుష్ప 2 లో కనిపించనున్నారు.