Homeసమీక్షలు18 Pages Review: 18 పేజెస్ - నిఖిల్ నుండి మరో కొత్త ప్రయత్నం

18 Pages Review: 18 పేజెస్ – నిఖిల్ నుండి మరో కొత్త ప్రయత్నం

- Advertisement -

సినిమా: 18 పేజేస్

రేటింగ్: 2.75/5

తారాగణం: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి

డైరెక్టర్: పలనాటి సూర్య ప్రతాప్

నిర్మాతలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్

నిఖిల్ నటించిన ’18 పేజెస్’ ఈ శుక్రవారం విడుదలైన రెండో సినిమా కాగా, ఈ యంగ్ హీరో నుండి వచ్చిన ఇతర సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా ఒక వినూత్నమైన కాన్సెప్ట్ మరియు ఫ్రెష్ టేకింగ్ ను కలిగి ఉంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటివరకు మంచి సంగీతం మరియు ఆసక్తికరమైన ట్రైలర్ తో పాజిటివ్ బజ్ సృష్టించగలిగింది. మరి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, నిఖిల్ మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకున్నారా లేదా చూద్దాం పదండి.

కథ:

నిఖిల్ (సిద్ధు) ఎమోషన్స్ కంటే హేతుబద్ధత, టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతాడు. నందిని అనే అమ్మాయి (అనుపమ పరమేశ్వరన్) డైరీని చూసిన తర్వాత జీవితం పై అతని దృక్పథం సవాలు చేయబడుతుంది. అతడు ఈ క్రొత్త సమాచారాన్ని ఎలా నమ్ముతాడు? మరియు ఆ డైరీ అతని జీవితం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? సిద్ధు, నందినిల మధ్య సంబంధం ఎలా బలపడుతుంది అనేది మిగతా సినిమా.

నటీనటులు:

READ  డీజే టిల్లు సీక్వెల్ లో మళ్ళీ మారిన హీరోయిన్

నిఖిల్ గతంలో ఇటువంటి పాత్రలు చాలానే చేశారు. మరియు సిద్ధుగా సహజంగా మరియు కన్విన్సింగ్ గా కూడా కనిపించారు. అతని క్యారెక్టరైజేషన్ మరియు నటనతో ఎటువంటి సమస్యలు లేవు, కానీ పాత్ర డెప్త్ పరంగా దర్శకుడు వైపు నుండి మంచి ఎగ్జిక్యూషన్ తో పాత్రకి మరింత ఎడ్జ్ ఉంటే నిఖిల్ కు మరింత సహాయపడి ఉండేది. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ బలంగా ఉంది సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది, అలాగే ఆమె పాత్రలో సమర్థవంతంగా నటించారు. కానీ, నిఖిల్ పాత్రకు ఉన్నట్లు మరపురాని క్షణాలు మరియు ఆసక్తికరమైన క్యారెక్టరైజేషన్ ఆమె పాత్రకు లేకపోవడం కాస్త సమస్యగా మారింది. ప్రేక్షకులు ఆ పాత్ర నుంచి మరింత ఎమోషన్ కోరుకుంటారు.

విశ్లేషణ:

పేపర్ పై 18 పేజెస్ కి సుకుమార్ రూపొందించిన కాన్సెప్ట్ టెర్రిఫిక్ గానే కనిపిస్తుంది. అయితే, భావోద్వేగాలు అనుకున్న స్థాయిలో లేకపోవడం మరియు పడుతూ లేస్తూ సాగిన కథనం ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. దర్శకుడు అనుకున్నట్లుగా ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను తాకదు. ఇక చిత్రం క్లైమాక్స్ వైపు వెళ్ళేటప్పుడు కథా వస్తువులో ఉన్న ఆకర్షణను కోల్పోతుంది. కాసేపు లవ్ స్టోరీ కాసేపు సస్పెన్స్ ఇలా జానర్లు మారుతూ ఉండటం కూడా ప్రేక్షకులకి కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. స్థిరమైన కథనం గనక ఉండుంటే అది ఈ సినిమా ప్రభావాన్ని మరింత పెంచేది.

ప్లస్ పాయింట్స్:

  • నిఖిల్ నటన
  • కోర్ కాన్సెప్ట్
  • గోపీసుందర్ సంగీతం
  • ఫస్ట్ హాఫ్
READ  రామ్ చరణ్ సినిమా కోసం రికార్డు స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడు బుచ్చిబాబు

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ ఎగ్జిక్యూషన్
  • అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టరైజేషన్
  • కథనంలో స్థిరత్వం లేకపోవడం
  • ఆకర్షణీయమైన సన్నివేశాలు లేకపోవడం

తీర్పు:

18 పేజెస్ వంటి ఫ్రెష్ కాన్సెప్ట్ కు క్యారెక్టరైజేషన్స్ మరియు ఎమోషనల్ కనెక్ట్ విషయాలలో మరింత జాగ్రత్త అవసరం. ఈ చిత్రం కొన్ని అంశాల వరకూ అలా అన్నీ కుదిరేలా విజయం సాధించినా.. ద్వితీయార్థంలో కూడా కథనాన్ని వేగంగా నడిపి ఉంటే, సినిమా మొత్తంగాv ఇంకా బాగా రంజింపజేసేది.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories