టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో సినిమాతో నటుడిగా మరింత క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల వచ్చిన పుష్ప 1 మూవీ సక్సెస్ తో పాటు అందులో తన అద్భుత నటనకు గాను ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం దానికి కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప 2 మూవీ చేస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. విషయం ఏమిటంటే, పుష్ప 2 క్లైమాక్స్ ల పుష్ప 3 మూవీకి లీడ్ ఉంటుందని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పుష్ప 3 ఉంటుందని కన్ఫర్మ్ చేసారు రావు రమేష్.
లేటెస్ట్ గా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా రావు రమేష్ మాట్లాడుతూ, పుష్ప 2 మూవీ షూట్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చిందన్నారు. అలానే పుష్ప 3 మూవీ స్క్రిప్ట్ లాక్ అవడంతో పాటు కొన్ని సీన్స్ కూడా తీసారని అన్నారు. టీమ్ మొత్తం కూడా పుష్ప 2 పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉందని తెలిపారు. మొత్తంగా రావు రమేష్ వ్యాఖ్యలతో పుష్ప 3 మూవీ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.