పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్, సత్య, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని నేడు పాట్నాలో జరిగిన ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు మేకర్స్. ఇక పుష్ప 2 ట్రైలర్ మొత్తంగా అయితే డిజప్పాయింట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో అల్లు అర్జున్ స్టైల్ తో పాటు ఆయన పాలిక డైలాగ్స్ ఎంతో అదిరిపోయి. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పవర్ఫుల్ గా ఉంది. అయితే ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రధానంగా చూపించారు, కంటెంట్ పరంగా ట్రైలర్ లో ఏమి లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉంది. అయితే హీరోయిన్ తో పాటు ప్రధాన పాత్రలు అన్ని కూడా ట్రైలర్ లో చూపించారు.
మొత్తంగా అయితే డిజప్పాయింట్ చేసిన పుష్ప 2 ట్రైలర్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే లభిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ పరంగా రూ. 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్న పుష్ప 2 మూవీ రిలీజ్ తరువాత అన్ని ఏరియాల్లో ఏ స్థాయి నంబర్స్ పెడుతుందో చూడాలి. ఇక డిసెంబర్ 5న పుష్ప 2 మూవీని పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.