Homeసినిమా వార్తలుPushpa 2 Trailer Release Date Time Locked 'పుష్ప - 2' ట్రైలర్ రిలీజ్...

Pushpa 2 Trailer Release Date Time Locked ‘పుష్ప – 2’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక పుష్ప 2 నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్, రెండు గ్లింప్స్ టీజర్స్ కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. ఇక పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ని నేడు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు మేకర్స్. కాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ని నవంబర్ 17న సాయంత్రం 6 గం. 3 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు.

కాగా ఆ రోజు పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరుగనుంది. ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించి ఏర్పాట్లు పరిశీనలో ఉన్నాయట. మొత్తంగా అయితే రోజు రోజుకు అందరిలో భారీ హైప్ ఏర్పరుస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  Spirit Movie Music Sittings Begin'స్పిరిట్' మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories